ТОП просматриваемых книг сайта:
డయాబెటిక్ డైట్: డయాబెటిస్ కోసం పరిపూర్ణమైన వంటపుస్తకం. Lindsay Shepard
Читать онлайн.Название డయాబెటిక్ డైట్: డయాబెటిస్ కోసం పరిపూర్ణమైన వంటపుస్తకం
Год выпуска 0
isbn 9788835421542
Автор произведения Lindsay Shepard
Жанр Кулинария
Издательство Tektime S.r.l.s.
మొదట, మీరు పిండి పదార్థాలు మరియు చక్కెరలను తినేటప్పుడు, కాలేయంలో జరిగే జీవక్రియవల్ల ఇవి రక్తప్రవాహంలో గ్లూకోజ్‌గా మార్చబడతాయి. పిండి పదార్థాలు శక్తిని ఉత్పత్తి చేయడంలో వనరుగా ఉపయోగించబడుతున్నందున, గ్లూకోజ్‌ను విచ్ఛిన్నం చేయడానికి మరియు క్రియాత్మక శక్తిగా కణాలలోకి పంపించడానికి శరీరం క్లోమం నుండి ఇన్సులిన్‌ను స్రవిస్తుంది. అప్పుడు, శరీరం ఆక్సిజన్‌ను మిశ్రమంగా కలిపి ATP తయారుచేస్తుంది. ఇది మీ శరీరం యొక్క మొత్తం వ్యవస్థకు బలాన్నిచ్చే శక్తికి మూలమైవుంది.
శరీరంలో గ్లూకోజ్ అధిక మోతాదులో ఉన్నంత వరకు అన్నీ బాగుంటాయి. ఇది సంభవించినప్పుడు, శరీరం అదనపు గ్లూకోజ్‌ను కొవ్వుగా నిల్వ చేస్తుంది. ఏదేమైనా, ఒకానొక సమయంలో శరీరం దాన్ని తట్టుకోలేని స్థితికి వస్తుంది. ఈ సమయంలో ఇన్సులిన్ నిరోధకత జరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, రక్తప్రవాహంలో ఎక్కువ గ్లూకోజ్ ఉన్నందున మీ కణాలు గ్లూకోజ్‌ను తీసుకోవడం మానేస్తాయి.
ఇవి రక్తంలో చక్కెర స్థాయిలలో వచ్చే చిక్కులు.
మీ మొత్తం ఆరోగ్య నిర్వహణ ప్రణాళికలో తక్కువ పిండి పదార్థాలు, తక్కువ చక్కెర వున్న ఆహారం చాలా గొప్ప తేడాను కల్గిస్తుంది. హేతువు ఏమిటంటే, మీరు తినే పిండి పదార్థాలు మరియు చక్కెరల సంఖ్యను మీరు పరిమితం చేసినప్పుడు, మీరు ప్రాథమికంగా మీ శరీరానికి ఇప్పటికే రక్తప్రవాహంలో మరియు నిల్వలో ఉన్న వాటిని ప్రాసెస్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. కాబట్టి, మీరు లోటును సృష్టిస్తున్నారు, కాబట్టి ఇది శరీరం ఇప్పటికే నిల్వ చేసిన వాటిని ఉపయోగించుకునేలా చేస్తుంది.
ఈ విధంగా మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగిన రీతిలో వుండేలా చేయవచ్చు
మామూలుగా చెప్పాలంటే, మీరు చేస్తున్నది మీ శరీరానికి కొంత విశ్రాంతి నిస్తుంది. అందువల్ల, శరీరం యథాస్థితికి వచ్చే అవకాశం ఉంది. మీ శరీరం చివరికి సరైన స్థితికి వచ్చినప్పుడు, మీరు మీ మొత్తం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగల్గుతారు. అదనంగా, ప్రాసెస్ చేయడానికి తక్కువ పిండి పదార్థాలు మరియు గ్లూకోజ్ ఉన్నందున మందులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
మొదట, మీరు తక్కువ పిండి పదార్థాలు, తక్కువ చక్కెర వున్న ఆహారం తీసుకోవాలని అనుకోవడం కొంచెం మిమ్మల్ని మానసిక షాక్ కు గురిచేయవచ్చు. వాస్తవానికి, చాలా