ТОП просматриваемых книг сайта:
కోపాన్ని నిగ్రహించుకోవడం. Owen Jones
Читать онлайн.Название కోపాన్ని నిగ్రహించుకోవడం
Год выпуска 0
isbn 9788835422440
Автор произведения Owen Jones
Жанр Прочая образовательная литература
Издательство Tektime S.r.l.s.
కోపాన్ని నిగ్రహించుకోవడం గురించి.
కోపం నిగ్రహించుకోవడం గురించి ఆలోచించేటప్పుడు, భావోద్వేగాలను గూర్చిన లోతైన అవగాహన పొందడానికి మరియు కోపం నిగ్రహించుకునే పరిష్కార మార్గాలను వర్తింపజేయడానికి కృషి చేయడంలో కోపం మరియు దూకుడును నిశితంగా పరిశీలించడం విలువైనది.
తరచుగా, ఎవరైనా నిరాశను అనుభవించినప్పుడు, వారి భావోద్వేగాలు ప్రేరేపించినప్పుడు వారు బద్ధలైపోతారు. అయితే, రాత్రికి రాత్రే నిరాశ అనేది ఏర్పడదు; బదులుగా, అంతర్లీన సమస్యలు బయటకు వచ్చినప్పుడు నిరాశ సంభవిస్తుంది. అందువల్ల, నిరాశ అనేది లోతైన, నమ్మకం లేని భావం లేదా అవసరాలు మరియు కోరికలు తీరనప్పుడు లేదా పరిష్కరించబడని మనోవేదనలు లేదా విశ్వాసం లేకపోవడం మరియు అసంతృప్తి నుండి ఉత్పన్నమవుతుంది.
కోపం, ఒక వ్యక్తి అతను లేదా ఆమె అనుకున్నది జరగనప్పుడు, లేదా నిద్రాణమైన సమస్యల పరంపర, కోపాన్ని వెళ్లగ్రక్కే సమయం కోసం ఎదురుచూస్తున్నప్పుడు, చివరికి అది బయటకు వచ్చినప్పుడు కలిగే అనుభూతి. దూకుడు అనేది మరొక వ్యక్తిపై ఆధిపత్యం చెలాయించే శక్తివంతమైన చర్య లేదా పద్ధతి.
దూకుడు అనేది ముఖ్యంగా నిరాశతో ప్రేరేపించబడినప్పుడు చేసే ఒక వాదన, అలాగే హానికరమైన లేదా విధ్వంసక ప్రవర్తన. మీ జీవితం ప్రమాదంలో ఉంటే దూకుడు మంచిది, కానీ చాలా సందర్భాలలో దూకుడు హాని కలిగిస్తుంది.
మరోవైపు నిశ్చయత అనేది గాయం, విధ్వంసం లేదా వాదనకు గురికాకుండా మీ భావాలను మరొక వ్యక్తికి సమర్థవంతంగా తెలియజేసే ఒక రూపం. నిశ్చయత అనేది మనలో ఉన్న బలమైన, ధైర్యమైన, నమ్మకమైన గుణం, ఇతరులు మనలను హరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మన హక్కులను కాపాడుకోవడానికి ఇది సహాయపడుతుంది.
దూకుడు మరియు నిశ్చయత మధ్య వ్యత్యాసాన్ని గూర్చి మనం నేర్చుకుంటే, మనం మంచి ప్రవర్తనా సరళిని నేర్చుకుంటాము, అదే సమయంలో, మన జీవితాలను నియంత్రించుకుంటూ మరియు భవిష్యత్తులో సమస్యలను నివారిస్తాము.
మీరు నిరాశను అనుభవిస్తుంటే, మీరు మీ మనస్సులోని మీ నమ్మకాలు, అభిప్రాయాలు, సిద్ధాంతాలు, తార్కికం మొదలైన ఇష్టంలేకపోయినా వాటినే అంగీకరించాలని కోరుకోవచ్చు. . మీకు కోపం తెప్పించే మూలాలను సమీక్షించడం ద్వారా, మీరు కోపం రావడం చూసినప్పుడు ఉద్రిక్తతను తగ్గించవచ్చు; మీ చిరాకుకు కారణాలు మీ నియంత్రణలో లేనందున కోపం తెచ్చుకోవడం విలువైనది కాదని మీరు గ్రహిస్తారు.
ఉదాహరణకు, మిమ్మల్ని మీరు విశ్లేషించుకున్నప్పుడు, మీరు మరొక దృక్కోణాన్ని చూడవచ్చు మరియు మీకు నిరాశ లేదని తేల్చవచ్చు. ఈ వ్యూహాలన్నీ కోపాన్ని నిగ్రహించుకోవడం గురించే.
మీకు చెడు చేసిన వ్యక్తిపై తీసుకునే దృఢమైన చర్య, ఫ్యూజ్ కాలిపోవడం కంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ ప్రతిచర్య కారణంగా, కోపం నిగ్రహించుకోవడం గురించి, ఒక వ్యక్తి తన కోపాన్ని ఎలా కోల్పోతాడో మరియు అతను లేదా ఆమె ఎదుర్కోవాల్సిన పరిణామాలు ఏమిటో మనం ఒక ఉదాహరణ ద్వారా చూడవచ్చు.
ఉదాహరణకు, ఇద్దరు వ్యక్తులు వాదించుకుంటున్నారు మరి, గొడవ మొదలైంది. వారిలో ఒకరు మరొకరి గురించి అబద్ధాలు ప్రచారం చేశారని ఆరోపించారు. తరువాత అది హింసాత్మక గొడవగా మారుతుంది, అది చూసిన పొరుగువారు పోలీసులను పిలుస్తారు. పోలీసులు వచ్చినప్పుడు, ఇద్దరికీ సంకెళ్ళు వేసి జైలుకు తీసుకువెళ్తారు.
వారి సమస్యలు పెరిగాయి ఎందుకంటే
వారిద్దరూ జరిమానాలు, కోర్టు ఖర్చులు మరియు పరిశీలన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, ఒక సమస్య అనేక ఇతర సమస్యలకి దారితీసింది కాని అది అంతటితో ఆగిపోదు. ఈ ఇద్దరూ వారి జరిమానాలు, ఖర్చులు మరియు అన్నింటినీ చెల్లించినప్పుడు, అది పోలీసు రికార్డుల్లోకి
వెళ్తుంది, తద్వారా ప్రతి ఒక్కరూ జీవితాంతం వారిని అపరిపక్వ వ్యక్తులుగా పరిగణిస్తూ, నమ్మకంలేని హింసాత్మక వ్యక్తులుగా తీర్పు ఇస్తారు.
కోపం నిగ్రహించుకోనే విషయంలో ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం, ఈ దృష్టాంతంలో నొక్కిచెప్పడం అనేది ఉపయోగించబడింది. ఒక వ్యక్తి మరొక వ్యక్తి గురించి పొరుగువాళ్ళతో అబద్ధాలు వ్యాప్తి చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎదుర్కొంటారు.
పుకార్లకు గురైన వ్యక్తి తన స్నేహితుడి వద్దకు వెళ్ళి ఇలా అడిగాడు: 'నాకు తాగుడు సమస్య ఉందని
మీరు ప్రజ
లకు